నేను కవిని గాను గాయకుడను గాను. కాని భగవదనుగ్రహముచే ఈకీర్తనసంపుటిని అనామకుడనైన నేను కాకతాళీయముగ రచించడమైనది. భగవద్ప్రేరణ  లేకుండ జరిగేదేదిలేదు. ఇందులో నాప్రతాపమేమి లేదు. ఈకీర్తనల సంపుటి బ్రహ్మార్పణమే. నాదునికి మనికి కులుకు తళుకులన్ని ఆభగవంతుని  సంకల్పాలేగ. నేచేసిన కృషి చంద్రునికొక నూలు ప్రోగు వంటిదే. ఈకీర్తలందలి భావస్ఫూర్తి భగవంతునిచలవే. ఇక తప్పులన్ని నాదజ్ఞానజనితములే. పండితులు సంగీత విద్వాంసులు తప్పులమన్నించమని నాప్రార్థన.

ఓం తత్సత్  బ్రహ్మార్పణం


పూర్తిగా చదవండి