శీర్షిక - అహో ప్రజానికానికి అత్యంత ప్రీతి పాత్రమైనదే! - "స్త్రీ"



--------------------------------------------

చక్కని నీ ముఖ చంద్రబింబమునకు

గల్యాణమస్తు, బంగరుబొమ్మ!

నిద్దంపు నీ చెక్కుటద్దంపు రేకకు


నైశ్వర్యమస్తు, నెయ్యంపు దీవి!

మీటిన బగులు నీ మెఱుగు బాలిండ్లకు


సౌభాగ్యమస్తు, భద్రేభయాన!

వలపులు గులుకు నీ వాలు గన్నులకు న


త్యధిక భోగోస్తు, పద్మాయతాక్షి!



మధురిమము లొల్కు నీ ముద్దు మాటలకును

వైభవోన్నతిరస్తు, లావణ్యసీమ!

వన్నెచిన్నెలు గల్గు నీ మన్ననలకు

శాశ్వతస్థితిరస్తు, యోషాలలామ!



-------------------------------------------



దక్షిణదేశ యాత్రలొ వశమై ఒక సుందరిని చూచి ఆమె కమనీయ సౌందర్యానికి ముగ్ధుడై ఆశీఃపూర్వకంగా శ్రీనాథుడు చెప్పిన చక్కని చాటువు ఇది.





- విద్యానాథ్


పూర్తిగా చదవండి