మహెజాబీన్ రాసిన కొన్ని కవితలు ఈమధ్య చదివాను. కొన్ని చాలా బాగున్నాయి. అందులో నాకు నచ్చిన ఒక కవితని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

ఆ కవితకి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసాను. మరియు ఇది ఆ కవితలో ఒక భాగం మాత్రమే...

***

ఈ సంబంధాన్నిలాగే
కొనసాగించాలనుకుంటున్నాను

అగ్ని సాక్షిగా తప్ప
ఆకాశం సాక్షిగా
భూమి సాక్షిగా
సప్త సముద్రాల సాక్షిగా
ౠతువుల సాక్షిగా
పంచమి సాక్షిగా
అమావాస్య సాక్షిగా
ఆ చెట్టు కింద
మనం కలిసి కాలక్షేపం చేసాం

ఈ సరితారణ్యమంతా
కలిసి తిరిగాం

వెన్నెలనంతా
మన దోసిలిలో నింపుకునాం

ఎన్నెన్నో ఊహలతో, ఆశలతో
మనకొక కొత్త లోకాన్ని నిర్మించుకున్నాం

ఈ క్షణం లో నువ్వు నాతో లేవు
కాని మనం కలిసి గడిపిన క్షణాలన్ని ఇంకా నాతోనే ఉన్నాయి

అగ్ని సాక్షిగా తప్ప
ఆకశం సాక్షిగా
భూమి సాక్షిగా
సప్త సముద్రాల సాక్షిగా
ౠతువుల సాక్షిగా
పంచమి సాక్షిగా
అమావాస్య సాక్షిగా
ఈ సంబంధాన్నిలాగే
కొనసాగించాలనుకుంటున్నాను

నువ్వు నా పక్కన ఉన్నా... లేకున్నా...


***

గమనిక: నేను చేసిన మార్పులని italic టాగ్స్ లో పెట్టాను.
పూర్తిగా చదవండి