మేఘమా దేహమా
మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా
కరుగునే ఈ జీవనం

మెరుపులతో పాటు ఉరుములుగా
దని రిస రిమ దని స దని ప గ
మూగ బోయే జీవ స్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
శ్మౄతిలో మిగిలే నవ్వులు గా
వేసవిలో మంచు పల్లకి గా

పెనుగాలికి పెళ్ళి చూపు
పువు రాలిన వేళా కళ్యాణం
అందాక ఆరాటం
అశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో..

చిత్రం: మంచు పల్లకి
సంగీతం: రాజన్-నాగేంద్ర
వ్రాసినవారు: --
గాయని: S జానకి
పూర్తిగా చదవండి