చిన జీయరు స్వామి ఈరోజు పొద్దున TVలో ...

రామాయణ మహాభారత సారాన్ని ఒక్కొక్క వాక్యంలో ఎవరో పిళ్ళై (పుర్తి పేరు సరిగా వినలేదు) అనే ఆయన ఇలా చెప్పాట్ట.

రామాయణం: కావాలని జైలు కెళ్ళిన ఆమె (సీతమ్మ తల్లి) కథ.
భారతం: రాయబారానికెళ్ళిన అతని (శ్రీకృష్ణ భగవానుడు) కథ.

నిజమే అనిపించింది. తరచి చూస్తే, పై వాక్యంతో రామాయణమంతా తెలుస్తుంది, రెండో వాక్యంతో భారతమంతా తెలుస్తుంది.

సీతా మహాసాధ్వి తలచు కుంటే రావణాసురున్ని ఆపలేదా? లేక భస్మం చెయ్యలేదా?

జీయరు స్వామి ఇంకో మాట కూడా చెప్పారు. అన్ని పురాణ గాథలూ భగవంతునివైతే, రామాయణం మాత్రం సీతమ్మదంట. రాముడు, శరణు కోరిన వాణ్ణి మాత్రమే కాపాడుతాడంట. కానీ సీతమ్మ తల్లి అందర్నీ క్షమిస్తుందంట.


పూర్తిగా చదవండి