ఏమైనా ఆ రోజులు ఆరోజులే మళ్ళీ తిరిగిరావు. చిన్నప్పటి చదువుకునే రోజులు. మాది చిన్నపల్లెటూరు, మా ఊరికి నాలుగు కిలోమీటర్లదూరంలో స్కూలు. ప్రతిరోజు రిక్షాలో వెళ్ళెవాళ్ళం. సన్నని రోడ్డు, చుట్టూ పంటపొలాలు, ఆ చక్కటి దృశ్యాలు ఇంకా కళ్ళముందు కదులుతున్నాయి. పాటలుపాడుతూ కేరింతలు కొడుతూ అల్లరితో బయలుదేరేవాళ్ళం. కాగితాలను చిన్నముక్కలుగా చించి, చల్లని పైరగాలికి ఎగరవేయడం. గాలి పంకాలు చేసి తిరుగుతుంటే, ఎవరిది
పూర్తిగా చదవండి