ది రైజింగ్ స్టార్
Kathalu, Telugu, కథలు, తెలుగు July 29th, 2006Wednesday 4th August 2004 11:46:30 AM
౨౦౦౪(2004)లో సెంట్రల్ మిషిగన్ విశ్వవిధ్యాలయంలో M.B.A చదువుకుంటున్న సమయంలో రాసిన కథ ఇది.

మౌంట్ ఫ్లెజెంట్ లో అతి సందడైన ప్రదేశం : ది ఫోరం అపార్ట్మెంట్స్..
అనగనగా ఒక రోజు సాయంకాలం ఫోరంలో ఉన్న వారికి ఏవో రాగాలు వినపడుతున్నాయి..
పావు గంట...అర గంట...గంట...రెండు గంటలు..రాగాలు ఆగట్లేవు..కానీ శృతి అపశృతిగా మారింది..గాందర్వ రాగం కాస్త గార్దప రాగంగా మారింది..ఫోరంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్ధం కావట్లేదు..ఒక పక్క చీకటి...ఇంకో పక్క అతి భయంకరమైన కచ్చేరీ..
జనాలకి ఏం చెయ్యాలో అర్ధంకాక రక రకాలుగా ఆలోచిస్తున్నరు...అర్ధరాత్రి పన్నెండు దాటినా ఇంకా ఆడియో ఆగట్లేదు..ఎట్టకేలకు ఫోరంలో జనాలంతా కలిసి ధైర్యం చెసారు..
ఈ కొత్త(చెత్త)సంగీతానికి కారకుడెవరో కనుక్కుందామని బయలు దేరారు..సంగీతం ఎక్కడినుంచి వస్తుందో తెలుసుకోడానికి ఎంతో సమయం పట్టలేదు..ఫోరం పాండ్ పక్కనే...ఫోల్డబుల్ చైర్లో ఒక పెద్ద గిటార్ పైన జిమ్ కి వెళ్లి మరీ డెవలప్ చేసుకున్న బండ చేతులు కదులుతున్నాయి... ఆపకుండా వాయిస్తున్న మహ మ్యూజీషియన్ ఎవరా ఎవరా అని ఆత్రుతగా చూస్తే కండలు తిరిగిన చేతులు కాల్లు మత్రమే కనపడుతున్నాయి...మొహం తెలియదు ఇంక...ఎందుకంటె ఈ వింత అర్టిస్ట్ తలపైన కౌబాయ్ కాప్ పెట్టాడు...ఎక్సైట్మెంట్(చిరాకు) ఆపుకోలేక చప్పున కాప్ తీసి పాండ్ లో పడేసారు... వెలుతురు సరిగ్గా లేకపోవడం వల్ల మొహం స్పష్టంగా కనపడట్లేదు..కాని పోలికలు పోల్చుకుని చూస్తే జనాలకి పెద్ద షాక్...సాయంత్రం నుంచి ఆపకుండా గిటార్ వాయిస్తున్న మహ ఘనుడు
ఇంకెవ్వరో కాదు, నగేష్ బాబాయ్!!!!!...
"సీడీ ప్లేయర్ ఉంది కదా, అది ఆపి నువ్వు పాడటం ఎందుకురా? మా చెవులు పాడు చేసావు కదరా, ఇదేం పోయేకాలంరా నీకు" అన్నారు జనాలంతా...ఆ తర్వాత ఏం జరిగిందో మీరే ఊహించుకోండి...
%@()డిష్యుం...ధబ్@%@...ధభేల్_^!%@**&@)....
రెండు నిమిషల తర్వాత....గిటార్ ఒక పక్కన...నగేష్ ఒక పక్కన......నగేష్ ని చితక బాదారు...
!!!**@%@()@%@%@^)_^!%@@);;%@(
గమనిక: అన్ని పాత్రలు నిజమైనవి, తగువులేమైనా ఉంటే దుర్గి న్యాయస్తానం లో మాత్రమే..
can't read telugu? read the t-english version here

పూర్తిగా చదవండి