కోఫీ అన్నన్ చెప్పిన కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు
మీకు తెలుసా! August 22nd, 2006యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవెలెప్‌మెంట్ వాళ్ళు ప్రపంచ ప్రజల జీవన విధానాల గురించి రకరకాల సర్వేలు చేస్తూ వుంటారట. వాటిలో కొన్నింటిని కోఫీ అన్నన్ గారు బయటకు వెల్లడించారు. చూడండి.
- ప్రపంచంలోని 225మంది అత్యంత ధనికుల (అందులో 60 మంది అమెరకన్లే) మొత్తం ఆదాయాన్ని కలిపితే అది ఒక ట్రిలియన్ డాలర్ల కన్నా పైచిలుకే. ఇది ప్రపంచ జనాభాలో 47% బీదల సంవత్సరాదాయానికి సమానం.
- అమెరికన్లు సంవత్సరానికి 260 పౌండ్ల మాంసాన్ని వాడతారు. అదే బంగ్లాదేశ్ లో ఆరున్నర పౌండ్లేనట.
- ఐరోపియన్లు ఐస్ క్రీమ్, తత్సంబంధిత పదార్థాల మీద 11 బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఇది ప్రపంచ జనాభాకు ఒక సంవత్సరం వరకూ మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యమూ కల్పిచడానికయ్యే దానికన్నా 2 బిలియన్ల డాలర్లు ఎక్కువ.
- 48 తక్కువ అభివృద్ధి చెందిన దేశాల మొత్తం ఉత్పాదకత కన్నా, మొదటి ముగ్గురి ధనవంతుల ఆస్తుల మొత్తమే ఎక్కువ.
- అమెరికన్లు సంవత్సరానికి 8 బిలియన్ డాలర్లు సౌందర్య సాధనాలపై ఖర్చ చేస్తున్నారు.ఇది ప్రపంచం మొత్తానికీ సాధారణ అక్షరాస్యతకు అవసరం అయ్యేదానికన్నా 2 బిలియన్ డాలర్లెక్కువ.
- అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 4.4 బిలియన్ల జనాభాలో,
- ఐదులో మూడవ వంతు మందికి కనీస పారిశుద్ధ్య సౌకర్యం లేదు.
- మూడవ వంతు మందికి మంచినీటి సౌకర్యమే లేదు.
- నాల్గవ వంతు మందికి నివాసం లేదు.
- ఐదవ వంతు మందికి మంచి ఆరోగ్య సౌకర్యం లేదు.
- ప్రతి వెయ్యిమందికీ స్వీడన్ లో 681 టెలిఫోన్ లైన్లూ, అమెరికాలో 626 వుంటే, ఆఫ్ఘనిస్థాన్, కంబోడియా, ఛాడ్, కాంగో వంటి దేశాల్లో ఒక్కటి మాత్రమే వుంది.
- అంచనాల ప్రకారం ప్రపంచంలోని అందరికీ కనీస చదువు, కనీస ఆరోగ్యం, సరిపడా ఆహారం, ఆడవారికి సరైన ఆరోగ్యం, మంచినీటి సరపరా, పారిశుద్ధ్య వసతులూ కల్పించడానికి సుమారు 40 బిలియన్ డాలర్లు సంవత్నరానికి అవసరం అవుతుంది. ఇది ప్రపంచం లోని 225 మంది ధనవంతుల సంపదలో 4% కన్నా తక్కువ.

పూర్తిగా చదవండి