Gandhi

కాసిని నానీలు

ఇరవై నాలుగక్షరాల్లో
ఇనరశ్మిని దట్టించు
‘నానీ’ ఐ పేల్తుంది

ప్రియుడిపై తమకం / నఖక్షతాల్లో కనిపిస్తున్నది
గోరింట బాగా పండింది

కవిత్వం వాడికో ఆయుధం
దానితోనే వాడు / జనాల ప్రాణాలు తీస్తుంటాడు

బాలల ఉత్సవానికి / మంత్రి కోసం నిరీక్షణ
ఎండలో శోషిల్లి బాలలు

మొన్న ప్రేమగా చూసిన బాలుడు
నేడు ఈర్ష్యగా చూస్తున్నాడు
బాల్యం పోయింది

నింగిమగ్గం ఆసులో / కండె-సూరీడు
తూర్పూపడమరలకు తిరుగుతూ

గాంధీ అంటే వాడికి ఇష్టం
గాంధీ బొమ్మున్న నోట్ల కోసం
ఏమైనా చేస్తాడు.

- సి.హెచ్.వి. బృందావన రావు

ప్రచురణ : పత్రిక (మార్చి ‘06)


పూర్తిగా చదవండి