పల్లవి:



గుండెలో వాలవా చెలి చిలకా



శ్వాసలో కోరిక విన్నావుగా



కళ్ళలో చేరవా తొలి వెలుగా



నీడవై చాటుగ ఉన్నావుగా



మాటలే చేతకాక సైగ చేసానుగా



సంతకం లేని లేఖ చేరనే లేదుగా



కలుసుకో త్వరగ కలలు నిజమవగ



చరణం 1



నీ వెంటే తరుముతూ ఉంటె



అసలు కన్నెత్తి చూసావ నన్ను



మరి నీ ముందే తిరుగుతూ ఉంటె



ఎపుడు పన్నెత్తి పిలిచావ నన్ను



రోజు ఇలా ఈ గాలిలా నీ చెవిని తాకేది నేనేగ



మామూలుగా మాటడక ఈ గాలి గొలేంటి చిత్రంగా



కలుసుకో త్వరగ కలలు నిజమవగ



కళ్ళలో చేరవా తొలి వెలుగా



నీడవై చాటుగ ఉన్నావుగా



చరణం 2



కాస్తైన చొరవ చెయందే వరస కలిపేదెలాగంట నీతో



నువ్వు కొంతైన చనువు ఇవ్వందే తెలుసుకోలేను నీ సంగతేదో

వెంటాడక వేటాడక వలలోన పడుతుంద వలపైన



నన్నింతగా వేధించక మన్నించి మనసివ్వు ఇపుడైన



కలుసుకో త్వరగ కలలు నిజమవగ

పూర్తిగా చదవండి