రొయ్యల వేపుడు
నాన్ వెజిటేరియన్, వేపుళ్ళు October 29th, 2006
కావలసినవి :
ఉల్లిపాయలు - 3
పచ్హిమిరపకాయలు -5
జీలకర్ర - 1 tbl spoon
గరం మసాల - 1 tbl spoon
అల్లంవెల్లుల్లి పేస్టూ -1 1/2 tbl spoon
రొయ్యలు - 1/4 kg
కారం - 1 spoon
పసుపు
ఉప్పు - 1/2 to 1 tbl spoon
కొత్తిమీర
తయారుచేసే విధానం :
1. ముందుగా జీలకర్ర గ్రైండ్ చెయ్యాలి . అందులో ఉల్లిపాయముక్కలు వేసి గ్రైండ్ చెయ్యాలి.
2. ఇప్పుడు పాన్ లో నునేను వేసి అది వేడి అయ్యాక అందులో ఉల్లిపాయముద్దను వేసి బాగా ఫ్రై చెయ్యాలి.
3. అది వేగినాక అందులో అల్లుంవెల్లుల్లి పేస్టూ , గరం మసాల వేసి వేపాలి . అది కొంచెం వేగాక అందులో రొయ్యలు వేసి వేయించాలి . అందులో కారం , పసుపు , ఉప్పు వేయ్యలి .
4. ఇంక అది వేయిస్తూ అప్పుడప్పుడు ఆ పాన్ మీద మోత పెట్టి వేయించాలి. అలా చేస్తే రొయ్యలు వుడుకుతాయి . కొంచెం అలా ఫ్రై అయ్యాక దింపేముందు కొత్తీమెర వేయ్యాలి.
పూర్తిగా చదవండి