కమ్మని కలలో
వన్నెల చిన్నది వద్దకి చేరింది
మనసిమ్మని నన్ను
అల్లరి చేస్తూ మారాం చేసింది కమ్మని
చూస్తాడు మా నాన్నా
లేస్తాడు మా అన్నా
తిడుతుంది అమ్మమ్మ
వింటుంది మా అమ్మా
అన్నా నేనన్నా తన అందం అంద జేసిందయ్యొ కమ్మని
తన అందమే అందం
నిలువెత్తు సౌందర్యం
తన వదనమే మధురం
విరిసేటి ఓ కమలం
అయ్యో అయ్యయ్యో నన్నే మాయ జేసిందయ్యో కమ్మని
తానంటే నేనంది
నేనంటే తానంది
చేరువవుతానంది
చేజారి పోయింది
కలా నన్నలా మళ్లీ ఒంటరివాడ్ని చేసిందయ్యో అయ్యొ అయ్యో అయ్యయ్యో
కమ్మని కలలో
వన్నెల చిన్నది వద్దకి చేరింది
ముద్దిమ్మని నన్ను
అల్లరి చేస్తూ అలజడి రేపిందీ
పూర్తిగా చదవండి