జాతులను దోపిడీ చేయుట యెట్లనగా…. గ్యాస్ – ఎక్కడ ద…
Telugu December 7th, 2006జాతులను దోపిడీ చేయుట యెట్లనగా....
గ్యాస్ - ఎక్కడ దొరుకుతోంది : కె.జి. బేసిన్ అని వ్యవహరించబడుతున్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మరియు ఆ జిల్లాల సముద్రజలాల్లో.
వెలికితీతలో క్రియాశీలంగా పాల్గొంటున్న సంస్థలు : రిలయెన్స్, కెయిర్న్ ఎనర్జీ (అమెరికా) ఓఎన్‌జీసీ, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్.
ఆంధ్రా సంస్థలు : లేనేలేవు.
కారణం : చంద్రబాబునాయుడు హయాంలో ఆయనకి పట్టిన ప్రైవేటైజేషన్ పిచ్చి మూలాన ఆంధ్ర ప్రభుత్వం తరఫున ఓ స్వతంత్ర వెలికితీత సంస్థ ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చెయ్యకపోవడం.
ప్రస్తుతప్రభుత్వం ఏం చేస్తోంది :చంద్రబాబునాయుణ్ణి తప్పుపడుతోంది.అంబానీల దగ్గర లంచాలు మెక్కేసినందువల్లనో ఏమో ఆంధ్ర తరఫున వెలికితీత సంస్థని ఏర్పరచుకునే దిశగా ఇప్పుడు కూడా ఎలాంటి ప్రయత్నమూ జరగట్లేదు."మాకు కొన్ని బ్లాకులు కేటాయించమని చెప్పండి"అంటూ యూనియన్ ప్రభుత్వాన్ని దేవిరిస్తున్నారు.
మరి ఇప్పుడు ఆంధ్రా గ్యాస్ ఎక్కడికి వెళుతోంది : ఆంధ్రా తప్ప మిగతా అన్ని రిపబ్లిక్కులకీ పంపడానికి రంగం సిద్ధమైంది.పైన పేర్కొన్న సంస్థలు ఆయా ప్రభుత్వాలతో ఇప్పటికే ఒప్పందాలకొచ్చేశాయి.కాకినాడ నుంచి అన్ని రిపబ్లిక్కులకీ పైప్‌లైన్ల పనులు చురుకుగా ప్రారంభమయ్యాయి. 2008-09నాటికల్లా ఆంధ్రా గ్యాస్ యూనియన్అంతటికీ అందుబాట్లోకొస్తుంది ఆంధ్రాకి తప్ప.
మరి గ్యాస్ జన్మస్థానమైన ఆంధ్రా పరిస్థితి ఏంటి : ఆ ఒక్కటీ అడక్కు.ఆంధ్రాకి గ్యాస్ సరఫరా నిమిత్తమై ఒక్క సంస్థ కూడా ఇప్పటి దాకా ఆంధ్ర ప్రభుత్వంతో ఒప్పందానికి రాలేదు.వచ్చే ఉద్దేశం కూడా ఉన్నట్లు కనిపించట్లేదు. కాని కాకినాడ సిటీకి మాత్రం గ్యాస్ ఇస్తామని ముకేశ్ అంబానీగారన్నారు.గ్యాస్ మనదే అయినా, తవ్వి ఎత్తుకెళ్ళేవారు వారే కనుక చివరికి అంతా వారి దయ మన ప్రాప్తం.ఇప్పుడు ఆంధ్రాలో తీవ్రమైన వంట గ్యాస్ కొరత ఏర్పడింది.దానికి తోడు మన గ్యాస్ ఆధారిత విద్యుత్‌కేంద్రాలు ఇంతకుముందు GAIL(Gas Authority of India) వాగ్దానం చేసిన గ్యాస్ అందక మూతపడుతున్నాయి.మరోపక్క ఆంధ్రాలో తమకున్న గ్యాస్ క్షేత్రాల నుంచి ఉత్తరప్రదేశ్ గుజరాత్‌లలోని విద్యుత్‌కేంద్రాలకి గ్యాస్ సరఫరా చేస్తామని రిలయెన్స్ చెబుతోంది."GAILవాగ్దానం చేసిన గ్యాస్ సంగతేమి"టని క్రితం వారం మన సభ్యుడొకరు ఇండియా దేశపు పార్లమెంటులో అడిగితే "గ్యాస్ లభ్యత లేకపోతే ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిపించుకోండి" అని సంబంధిత శాఖామంత్రి సెలవిచ్చారు. అనగా "మీ చావు మీరు చావండి. మీ గ్యాస్ మేం పట్టుకెళతాం గాని మీరు మాత్రం గ్యాస్ కావాలని అడక్కూడదు సుమా !" అని తాత్పర్యము.
ఎందుకిలా చేస్తున్నారు :ఆంధ్రాకి గ్యాస్ మీద హక్కేర్పడుతుందేమోననే భయం సదరు సంస్థలలోనే కాక యూనియన్‌ప్రభుత్వంలో కూడా గూడుకట్టుకుని ఉండడం అసలు కారణం.ఇప్పుడు గ్యాస్ మీద ఆంధ్రాకి ఉన్న హక్కునంగీకరిస్తే రేపు వెలికితియ్యబోయే పెట్రోలియంపై కూడా ఆంధ్రా హక్కుని అంగీకరించాల్సి వస్తుందేమోననే భయం ఈ అన్యాయపూరిత వైఖరులకి కారణమౌతోంది.ఇటీవల మార్చిన మైనింగ్ విధానం ప్రకారం తవ్వితీసుకునేవారికి ఆయా వనర్లపై సర్వహక్కులూ ఏర్పడతాయి.
ఫలితం : ఆంధ్రాకి ఏ హక్కులూ లేకుండా పోయాయి.గ్యాస్ లేదు.గ్యాస్ మీద రాయల్టీ లేదు.అమ్మకం పన్నైనా కడతారో లేదో తెలీదు.గ్యాస్ ఉన్న రిపబ్లిక్కైనా గ్యాస్ లేని రిపబ్లిక్కుల కంటే ఛండాలమైన పరిస్థితిలోకి నెట్టివేయబడింది.గ్యాస్ ఉన్న స్వతంత్ర దేశాలు దాన్ని వాడుకుని అభివృద్ధి చెందడమే కాక ఇతర దేశాలకి ఇతర దేశాలకి సైతం అమ్మి డాలర్లు సంపాదిస్తున్నాయి.మనం "జై భారత్"వాలాలం కనుక మనకి కనీసం రూపాయలు కూడా కళ్ళజూసే అవకాశం లేకుండా పోయింది.అసలు యూనియన్ ప్రభుత్వం కింద తెలుగువారికి రాష్ట్రమెందుకో అర్థం కావట్లేదు.దీనికో ప్రభుత్వమెందుకో కూడా అర్థంకావట్లేదు.ఈ రాష్ట్రం ఉన్నా లేనట్లే.అలా చేసేశారు యూనియన్‌వారు.
గోరుచుట్టు మీద రోకటి పోటు :పొగాకు బోర్డుకి తెలుగువారిని ఛైర్మన్‌లుగా నియమించరాదని యూనియన్‌ప్రభుత్వం ఈమధ్య ఓ ఉత్తర్వు జారీచేసింది.Tobacco Board of India కేంద్ర కార్యాలయాలు గుంటూరులో ఉండగా ఈ ఉత్తర్వు ఏంటని ఆశ్చర్యపోవడం మన వంతు. మరి ఏ యూనియన్ ప్రభుత్వ సంస్థకీ లేని నిబంధనలు పొగాకు బోర్డుకే ఎందుకు ? మరి రాజ్యాంగం సమానత్వం వంకాయ అంటారు గదా. ఎవరూ మాట్లాడరేం ?
ఇరాక్‌కీ ఆంధ్రాకి తేడా ఏముంది ?ఒక్క పెట్రోలు కోసమే ఇరాక్‌ని ఆక్రమించారు.అక్కడ "దురాక్రమణ"వాస్తవం అంతర్జాతీయంగా గుర్తించబడుతోంది.అదొక్కటే తేడా. అయినా "మేరా భారత్ మహాన్" అనాల్సిందే నంటారా ? సరే, తప్పేదేముంది ?
పూర్తిగా చదవండి