ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది

ఏ పువ్వు ఏ తేటిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దొ రాసున్నది
బంధాలై పెన వేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవుల
మధువులనే చవి చుడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఏన్నేన్నో శౄంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను

ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హౄదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలదీసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు

***

చిత్రం - నిరీక్షణ
సంగీతం - ఇళయరాజా
సాహిత్యం - రాజశ్రీ
గానం - S P బాలు, S జానకి
పూర్తిగా చదవండి