తొలి పొద్దులో గరిక పూవుపై మంచు తాకి మైమరచింది నేనేనా? ముంగిట ముగ్గుకి రంగులద్ది మురిసిపోయిన మనిషి నేనేనా? వాన చినుకుల్లో కలిసి తడిసి అలిసిపోయిన మనసు నాదేనా? రేకులు రాలుతున్న పూవును చూసి చెక్కిలి జారిన కన్నీరు నాదేనా? ఏది అప్పటి సున్నితత్వం? ఏది అప్పటి భావుకత్వం? వయసు పెరిగేకొద్దీ మనసు చిన్నదయిపోతుందా? ధనం వచ్చేకొద్దీ ఆనందం విలువ పెరిగిపోతుందా? నేను రాసిన నేను -ఆనందం అన్న కవిత లొ చివరి వాక్యాలను
పూర్తిగా చదవండి