రేడియో మిర్చి - మీరు మారాలి గురూ!
Telugu January 18th, 2007
“భార్గవి:
ఇవాళ్టి మన హాలో హైదరాబాద్లో టాపిక్ వెరైటీ సినిమా పేర్లు. మీరు సినిమా తీస్తే ఎలాంటి
టైటిల్ పెడతారో మాకు ఫోన్ చేసి చెప్పండి!
హేమంత్:
భార్గవీ, నేను చెప్తా! నా దగ్గర ఒక మంచి టైటిల్ వుంది!
భార్గవి:
ఓకే! నీకు ఇప్పుడే ఐడియా వచ్చిందా?
హేమంత్:
విను.... ఆయనది 6 అంగుళాలు! ఎలా వుందీ టైటిల్? ఆయనది 6 అంగుళాలు!
”
సరిగ్గా రెండు రోజుల క్రితం (జనవరి 17), ఉదయం 10 గంటల ప్రాంతంలో, నేను ఆఫీసుకు వెడుతూ, రేడియో మిర్చి 98.3 ఎఫ్.ఎమ్ లో విన్న హాలో హైదరాబాద్ ప్రొగ్రాంలో ఆర్.జె భార్గవి, ఆర్.జె హేమంత్ మధ్య జరిగిన సంభాషణ ఇది! వినడానికి జుగుప్సాకరంగా , అసహ్యాంగా వుండే ఇలాంటి సంభాషణలు ఈ మధ్యకాలంలో రేడియో మిర్చిలో తరచుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు ఆర్.జె లు ప్రొగ్రాంని కలసి హోస్ట్ చేసినప్పుడు ( ఉదాహరణకి ఆర్.జె భారతి & ఆర్.జె సౌమ్య – బంపర్ టు బంపర్, ఆర్.జె భార్గవి & ఆర్.జె హేమంత్ – హలో హైదరాబాద్ ), శ్రోతలను ఏదో విధంగా నవ్వించి తీరాలన్నధ్యాసలో పడి, వెకిలిగా, వినాడానికి ఏ మాత్రం వినసొంపుగాలేని అసంధర్భ ప్రేలాపనతో ప్రొగ్రాం అయింది అనిపిస్తున్నారు. రేడియో మిర్చి ఈ పధ్ధతి మార్చుకోపోతే, శ్రోతలు వినడానికి చాలా స్టేషన్లే వున్నాయ్.
>>పూర్తిగా చదవండి