మురళీ రవళి
పోస్ట్ బాక్స్ January 30th, 2007మధువులొలకవేమిరా మధుసూధనా
మధురాపురి ముదమందగ యదునందనా
యమున యదలో ఎప్పుడో జలపాతమై
కరిగి వీనుల విందులో నవనీతమై
వెదురు గుండెకు గానమూదిన పవనమేమో మోహనం
రాగ సుధాలాపనలో ప్రతి పయనం సమ్మోహనం
సందెల సందిట అందమే బృందావనిగా
నీ అందెల అలికిడికే పులకించిన అవనిగా
ఆ భావమే భూపాలమై లేచె మధురిమలే
నిశి మలుపులో ఆ పిలుపుకై వేచే అరుణిమలే
మధువులొలకవేమిరా మధుసూధనా
- స్వాతి
* “రేపల్లియ యదఝల్లున” స్పూర్తితో కొన్నేళ్ళ కిందట రాసుకున్నది.
దీన్ని ఎవరైనా ట్యూన్ చేస్తే వినాలని ఉంది.
పూర్తిగా చదవండి
