ప : దృష్ఠితాకు మా అయ్యకూ తెర వేయరే
దృష్ఠించెదరెవరైన దరిచేర నీయకురే

చ : చప్పుడు సేయుట కవసరము కాదరనే
అప్పుడు మజ్జనము ఆడునని తెలుపరే
కప్పురంబు సురటుల కొలిచెదరనరే
అప్పుడు సతులతోను ఆరగించినాడనరే

చ : దంతపు చవికలో ఏకాంతమాడుననరే
అంతరంగమున నెత్తము ఆడెదరని తెలుపరే
దొంతిపూల తొట్లలొన దొమిగూడియున్నాడనరే
చెంత కేలాకేళిలోన చిత్తగించియున్నాడనరే

చ : పట్టపు రాణియు తాను పవ్వళించియున్నాడనరే
రట్టుసేయనిందెవరైనా రానీయకురే
పట్టపు అలమేలుమంగ పతి శ్రీ వేంకటేశ్వరుడు
సృష్ఠిలోక కర్తగాన సేవించి పొమ్మనరే


Listen to Audio
దృష్ఠితాకు మా అయ్యకూ

పూర్తిగా చదవండి