ఆడవాళ్ళ సంగతులు కొన్ని(అమెరికా)
మీకు తెలుసా! February 8th, 2007- అమెరికాలోని వుద్యోగుల్లో ౪౬ శాతం (46%) మంది ఆడవాళ్ళైనా, సైంటిస్టులు, ఇంజనీర్ల విషయాని కొచ్చేసరికి వారి శాతం కేవలం ౨౩ (23%) మాత్రమేనట.
- అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మగవారితో సమానంగా ఆడవారి సంఖ్య గనుక పెంచితే, ఐటీ లోవున్న ఖాళీలన్నీ నిండిపోతాయట.
- ౪ (4th) వ తరగతి వరకూ సైన్సూ, లెక్కల్లో ఆడపిల్లలకూ, మగపిల్లలకూ సమానమైన ఇష్టం వున్నా, ౮ (8th) వ తరగతికి వచ్చేసరికి ఆడపిల్లల్లో మగపిల్లల్లాగా సైన్సూ,లెక్కలూ చేయగలమన్న అభిప్రాయం తగ్గుముఖం పడుతుందిట.
- అంతేకాక, టీచర్లూ, తల్లిదండ్రులూ, తోటివారూ సైన్సూ, సాంకేతిక విషయాలకు దూరంగా వుండేటట్లు ప్రోత్సహిస్తారట.
- వీటికి తోడు మీడియా కూడా (ప్రచార) మహిళా శాస్త్రవేత్త్లకూ, సాంకేతిక నిపుణులకూ తక్కువ గుర్తింపునిస్తోందిట.
- ౧౯౮౪ (1984) లో ౩౭ శాతం (37%) మంది మహిళలు కంప్యూటర్ సైన్సులో పట్టా పుచ్చుకుంటే, అది ౧౯౯౯ (1999) లో౨౦ శాతం (20%) కన్నా తక్కువకు పడిపోయిందిట. కానీ తిరిగి ౨౦౦౨ (2002) లో ౩౪ శాతానికి (34%) కు పుంజుకున్నదట.
- ఓ సర్వే ప్రకారం ఐటీ రంగంలోకి ఆడవారు రావడానికి కారణం అందరూ అనుకునేట్టు పెద్ద శాలరీ పాకేజీలు కాదట, మగవారితో సమానంగా పోటీపడి ఛాలెంజింగ్, మరియూ రిస్కీ జాబులు చెయ్యగలమని నిరూపించుకొనేందుకట.
- ౨౦౧౦ (2010) కల్లా టెక్నాలజీ సపోర్ట్ వుద్యోగాల్లో మహిళల శాతం ౯౭ (97%) కు పెరగవచ్చట.
- ౨౦౦౧ (2001) లో జరిగిన సర్వే ప్రకారం ఐటీ రంగంలోని మహిళలు సంపాదించిన మొత్తం ($713) మిగిలిన అన్ని రంగాల్లోని మహిళలు సంపాదించినమొత్తం ($597)కన్నా ఎక్కువట. (బ్రాకెట్లోనివి సగటు విలువలు)
- ౨౦౦౧ (2001) జనాభా గణాంకాల ప్రకారం వుద్యోగం సంపాదించిన ప్రతి పది మంది ఇంజనీరుల్లో ఒకరు స్త్రీట.
- టెక్నాలజీని వాడుకొనే మహిళా పారిశ్రామికవేత్తల శాతం ౫౮ (58%) వుండగా, పురుష పారిశ్రామికవేత్తలు కేవలం ౩౫ (35%) శాతం మాత్రమే నట.
మహిళల శాతం ౧౯౫౦(1950) ౧౯౯౯(1999)
డాక్టర్లు ౬.౧% (6.1%) ౨౪.౫% (24.5%)
ఇంజనీర్లు ౬.౧% (6.1%) ౧౦.౬% (10.6%)
&referrer=)
పూర్తిగా చదవండి