గాంధీగిరి vs దాదాగిరి
అవీ ఇవీ February 9th, 2007శంకర్ దాదా గారు మళ్ళీ తెర మీదకి వస్తున్నారు. Lage raho Munnabhai మొన్ననే చూసాను. చిరంజీవిగారే ఈ సినిమాకి తెలుగు versi0n లో హీరో అని తెలిసి నప్పటినుంచి నాలోబోల్డు సందేహాలు.
1. Munnabhai మొదటి దానిలో ఒక్క డుష్యుమ్ డుష్యుమ్ కూడా చెయ్యలేదు. ప్రేక్షకులకి రెండవ దానిలో కొంచం మెత్తగా కనపడినా అంత తేడా కనపడలేదు. కానీ మన శంకర్ దాదా అలా కాదు కదా. ముందో ఫైటు, వెనకో ఫైటు చేసేసాడు.
2. Lage raho లో చాలా మటుకు గాంధీగారిని elevate చేసి మున్నాభాయిని సైడు character చేసారు. మరి మన చిరంజీవిగారి సినిమాలో చిరంజీవిగారినే సైడు చేసేస్తే ఎలా.
3. మున్నాభాయి తిన్నట్టు శంకర్ దాదా చెంప దెబ్బ తింటాడా?
4. Lage raho లో గాంధీగారు కనపడితేనే మున్నాభాయి ధైర్యంగా, ధీమాగా కనపడ్డాడు. మరి మన శంకర్ దాదా గారు గాంధీ గారికి తన పక్కన అంత ప్రాధాన్యతని ఇవ్వగలడా.
ఇంకా ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. చూద్దాం, మన పరుచూరివారు ఎమి చేస్తారో. పరుచూరివారు అని ఎందుకు అన్నాను అంటే, ఈ సినిమాకి కధే ప్రాధాన్యం.
పూర్తిగా చదవండి