Feb 14
గొల్లమల్లమ్మ కోడలా
కోలాటం పాటలు జ్యోతి
నల్లా చీర నల్లా రైక
నాలుగొట్టంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా
తెల్లా చీర తెల్లా రైక
తెల్లవారంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా
ఎర్రా చీర ఎర్రా రైక
ఎడుగొట్టంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా
పచ్చా చీర పచ్చా రైక
పదిగొట్టంగ తానమా
గొల్లమల్లమ్మ కోడలా
గొల్ల మల్లమ్మ కోడలా నాయీ ముద్దుల కిన్నెరా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి