అల్లం పచ్చడి
పచ్చళ్లు February 14th, 2007
కావలసినవి :
అల్లం - 250 gms
కారం - 1 టీ కప్ ( 125 gms )
చింతపండు - 250 gms
బెల్లం - 250 gms
వెల్లుల్లిపాయలు - 2
ఉప్పు - తగినంత
ఎండుమిరపకాయలు - 5
ఆవాలు - 3 tbl spoons
శనగపప్పు - 3 tbl spoons
మినపప్పు - 3 tbl spoons
కరివేపాకు - 3 రెబ్బలు
మెంతులు - 2 tbl spoons
నునె - 200 gms
తయారు చేసే విధానం :
1. ముందుగా అల్లం ని నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా కడిగి దాని పొట్టు తిసేసి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
2. చింతపండులో ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోసి కాసేపు నానబెట్టాలి. తర్వాత దాని గుజ్జు తీసుకోవాలి.
3. ఇప్పుడు అల్లం ముక్కలు, చింతపండు గుజ్జు, 1 వెల్లుల్లిపాయ, బెల్లం ముక్కలు, మెంతులు, కారం, ఉప్పు వేసి గ్రైండ్ చెసుకోవాలి.
4. ఇప్పుడు పాన్ లో నునె వేసి వేడి చెయ్యాలి. అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, 1 వెల్లుల్లిపాయ చిదగొట్టి , ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి.
5. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం మిశ్రమాన్ని అందులో కలపాలి.
6. అల్లం పచ్చడిని ఒక గాజు సిసాలో వేసుకుంటే ఎన్ని రోజులయినా పాడవకుండా వుంటుంది.
పూర్తిగా చదవండి