మొన్న నా ఇంటర్వ్యూలలో భాగంగా టెక్సాస్ కు మూడు సార్లు వెళ్లాను. కానీ ప్రతి సారీ మన తోటి తెలుగు బ్లాగరయిన ‘కాదరయ్య’ను అదే మన ‘రానారె’ ను కలవాలనుకొంటూనే ఉన్నాను. మొదటి రెండు సార్లు కుదిరింది కాదు, ఇలా కాదని ఈసారి వయా హ్యూస్టన్ వెళ్లాను. అలా మూడోసారి ముచ్చటగా కలిసి ముచ్చట్లు చెప్పుకొనే అవకాశం దొరికింది.
ఠంచనుగా అనుకొన్న సమయానికే కలుసుకొన్నాం ఇద్దరం. అన్నట్టు మీరెవరైనా ఆర్కుట్ లో రానారె ఫోటోలు చూసిఉంటే (మా మరో [...]
పూర్తిగా చదవండి
ఏ ఆర్ రెహ్మాన్ అనగానే మీకేమి గుర్తొస్తుంది? ’ముక్కాలా ముకాబ్‌లా…’ నా లేక ‘ఓ చెలియా నా ప్రియసఖియా…’నా? అప్పట్లో యావద్భారతాన్నీ ఒక ఊపు ఊపిన ‘ముక్కాలా…’ పాట రెహ్మాన్ కి తెచ్చిన గుర్తింపు సామాన్యమైనది కాదు. అదొక ప్రభంజనం అప్పట్లో. కానీ ఇప్పటికీ ఆ సినిమాలో పాట జనాల నోళ్ళలో నలుగుతున్నదీ, టీవీ చానళ్ళలో అప్పుడప్పుడు మెరుస్తున్నదీ ఏదీ అంటే ‘ఓ చెలియా…’ పాటనే చెప్పుకోవాలి. దానికి కారణం బ్రహ్మరహస్యం ఏమీ కాదు. మాధుర్య ప్రధానమైన, [...]
పూర్తిగా చదవండి
జీవితంలో ప్రతి ఒక్కరూ (మరొక్కసారి ప్రతి ఒక్కరూ) కనీసం ఒక్కసారైనా... నేనిలా అవుదామనుకున్నాను ... నేనిలా చేస్తే బాగుండేది... ఇది కాకపోతే అది అయ్యుండేదిఅని అనుకుంటూ భవిష్య ప్రణాళికలేస్తూ వుంటారు.
స్కూల్లో పక్కనున్న వాణ్ణి ఫస్ట్ వచ్చినందుకు పంతులు మెచ్చుకుంటూంటే, అందరూ ఆరాధనగా అతన్ని చూస్తూంటే, ఈ సారి నేనూ ఫస్ట్ వచ్చి అందర్లో హీరో అవ్వాలని అనుకోనివాడెవ్వడు?
కాలేజీలో ఝామ్మంటూ లేటెస్ట్ ఫ్యాషన్ లతో
పూర్తిగా చదవండి
“వెలంటైన్స్ డే” గురించి చెప్పుకునేటప్పుడు చాక్లేట్లను పక్కన పెట్టొద్దు, ఎందుకంటే అవి గ్రీటింగ్ కార్డులకంటే పెద్ద ధందా ! 12 బిలియన్ డాలర్ల మార్కెట్ అంట మరి [దాదాపు 6,000 కోట్ల డాలర్లు / 2,64,000 కోట్ల రూపాయిలు].
అయితే ఏంది?
పూర్తిగా చదవండి
ఈ మధ్యన దృపాల్‌లోని ఒక అందమైన థీమ్‌ని వర్డ్‌ప్రెస్ వాళ్ళు మక్కికిమక్కి దించేసారు. గార్లాండ్ అనే ఈ థీమ్ చాలా మంది బ్లాగర్లను ఆకట్టుకుంది. దీనిలో మనకిష్టమైన విధంగా రంగులను మార్చుకోవచ్చు. కానీ ఈ రూపలావణ్యాన్ని ప్రస్తుతానికి వర్డ్‌ప్రెస్ డొమైన్‌లోని బ్లాగులకే పరిమితం చేసారు; ఎక్కడా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇవ్వలేదు.
నా పాత బ్లాగులలో ఒక దానిని దీనితో అలకరించాను. చాలా బాగుంది. మీరూ ప్రయత్నించి చూడండి. తప్పకుండా నచ్చుతుంది.
పూర్తిగా చదవండి
నెలల పసిపాపల్ని తల్లిపాలకి దూరం చేసి
తెలిసీ తిలియక ముందే క్రష్ ల పాలు చేసి
మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.
అమ్మ కి నాన్న కి మధ్య ఆదమరచి నిద్రపోవాల్సిన వేళ లో
విసుగుతోనొ అలసటతోనో అర్దరాత్రి ఆఫీస్ లోనో ఉండి
మనం వాళ్ళ కోసం సంపాదిస్తున్నాం.
పాలబువ్వలు పెట్టే తీరిక లేక ప్రోసెస్డ్ తిండి అలవాటు చేసి
దాగుడు మూతలాడలేక ప్లే స్కూల్ కి పంపి
ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించలేక
ట్యూషన్ కని ఉదయపు లేత నిద్రపై నీళ్ళు చల్లి
ఇదంతా చేసి
అమాయకపు బాల్యాన్నంతా దోచేసి
మనం నిజంగా [...]
పూర్తిగా చదవండి