తెలతెలవారుతుండగా పెరటి గోడ పై కూర్చుని చెరువులో ఈదులాడే చేపపిల్లల చేష్టల్లోని చిత్రాలు చూస్తుంటే, ఆనందానికి అసలు అర్ధం ఇదేనేమో అనిపిస్తుంది. ఆలయ శిఖరాల నుండి “గంగాతరంగ రమణీయ జటా కలాపం…” అంటూ వెలువడిన శివస్తుతి వినగానే మనస్సుకి ఆ ఆనందపు అనుభవం ఏమిటో తెలుస్తుంది. “ప్రాణానల సంయోగం” వల్ల పుట్టిన నాదం ఆకాశ మార్గాన ప్రయాణించి, నీటి అలలపై తేలియాడి, భూమాత పాదాలని స్పృశించి….పంచభూత సమ్మిళతమైన ప్రణవరూపంగా సాక్షాత్కరిస్తుంది. పాడిఆవుల వరప్రసాదమైన గుమ్మపాలు, వాటిని కడవలలో నింపి తీసుకెళ్ళే [...]
పూర్తిగా చదవండి