నా పైతరగతోళ్లు ఒగ ఇద్దురు పిల్లకాయలు నాగన్నైవోరి బడికి ఎగనామంబెట్టి వంకలో బుడ్డపక్కెలు (ఒక చేప జాతి) పట్టేదానికి బొయి, వాళ్లమ్మో నాయనో జూసి "*న్‌జా కొడకల్లాలా బడికి బోకండా వంకలంబడీ కాలవలంబడీ ఏమి యారకతినే పన్జేచ్చాండార్రా" అని చేతిలో ఈతబర్రతో యంటబడితే సచ్చితిం బతికితి మని వోళ్లకు దొరక్కండా *న్‌కోని పైన ఉరికినారనుకో - ఈ తమాసా సూసినాంక ఎవురికన్నా సెప్పిందాంకా అన్నం సగిచ్చదుగదా మనకు! వొగేల (ఒకవేళ)
పూర్తిగా చదవండి