కావలసినవి :

బాస్మతి రైస్ - 2 cups(250 gms)

టొమటోలు - 4

బఠాణిలు - 1/2 cup(నానబెట్టి,వుడికించాలి)

బంగాలదుంప - 1

ఉల్లిపాయ - 2 (సన్నగ పొడుగ్గ)

పచ్చిమిరపకాయలు - 4

అల్లం వెల్లుల్లి పేస్టు - 1 1/2 tbl spoon

లవంగాలు - 5

యాలకులు - 3

బిర్యాని ఆకు - 3

సాంబార్ పొడి - 1 1/2 or 2 tbl spoon

ఉప్పు - తగినంత

కొత్తిమెర

తయారు చేసే విధానం :


1.కూకర్ లో నునె వేసి వేడి చేసి అది వేడి అయ్యాక అందులో లవంగాలు, యాలకులు, బిర్యాని ఆకు వేసి వేయించాలి.

2.ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి.

3.అది వేయించాక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి.టొమటొ ముక్కలు వేసి వేయించాలి.

4.దానిలో బఠాణిలు,బంగాలదుంప ముక్కలు వేసి కొంచెంసేపు వేయించి అందులో సాంబార్ పొడి, ఉప్పు వేసి కలపాలి.

5.ఇప్పుడు బియ్యం కడిగి అందులో వేసి కొంచెంసేపు వేయించి అందులో నీళ్ళు(ఒక కప్పు బియ్యం కి 1 1/2 లేదా 2 కప్పు నీళ్ళు)పోసి ఒక విసెల్ రానివ్వాలి.

6.అందులో కొత్తిమెర వేసి కలపాలి.ఇప్పుడు వేడి వేడి టొమటొ రైస్ నీ ఆరగించండి.

పూర్తిగా చదవండి