అంతా మన మంచికే
క్రికెట్ March 28th, 2007
క్రికెట్లో ఇండియా ఓడిపోయి మనకు మన దేశానికి ఒక మహొపకారం చేసింది. అదేమిటో ఒకసారి ఇక్కడ చూడండి.(ఈనాడు నుండి)
టీమ్ ఇండియా మేలు చేసిందిలా...
ప్రపంచ కప్‌లో 'టీమ్ ఇండియా' పరాజయం భారీ స్థాయిలో ప్రకటనలపై ఖర్చుపెట్టిన కార్పొరేట్ వర్గాలకు మింగుడుపడకపోవచ్చు గాక! ఆర్థిక రంగానికి మాత్రం మేలే జరిగింది అంటున్నారు విశ్లేషకులు. ఏమిటీ... ఓటమి కూడా మేలు చేస్తుందా...? అని ఆశ్చర్యపోకండి. అదెలాగో చదవండి.
* దేశంలో మొత్తం కేబుల్, శాటిలైట్ ప్రసారాలను అందించే ఇళ్లు దాదాపు 8 కోట్లు ఉన్నట్లు అంచనా. దీనిలో ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లు చూసేవారు 3% ఉండొచ్చు. ఇప్పటి వరకు అయిన మ్యాచ్‌లు కాకుండా మిగిలిన 28 మ్యాచ్‌లనూ తప్పకుండా చూసే వారి సంఖ్య 3శాతమే ఉంటుంది.
* టీమ్ ఇండియా ప్రస్థానం ఫైనల్ దాకా సాగి ఉంటే మరో ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చేది. ఈ లెక్క ప్రకారం 58 లక్షల మంది మ్యాచ్‌లు చూస్తారనుకుంటే ఆర్థిక రంగానికి సుమారు 3710 కోట్ల పని గంటల ఉత్పాదకత నష్టమొచ్చేది.
* ఒత్తిడి కారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యలు, పరీక్షలకు చదువుకునే విద్యార్థులకు ఏకాగ్రత లోపించడం తదితర నష్టాలు దీనికి అదనం.
* తొలి అంకంలోనే భారత్ నిష్క్రమణతో వారు మ్యాచ్‌ల జోలికి వెళ్లకపోవడం వల్ల 4810 కోట్ల పని గంటల ఉత్పాదకత లాభం అదనంగా చేకూరనుంది.
* అంటే 4810 కోట్ల పనిగంటల ద్వారా మొత్తం రూ.817 కోట్లు దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)కి జమ అవుతాయి. భారత్ నిష్క్రమణ ద్వారా కార్పొరేట్లు నష్టపోతాయని లెక్కకడుతున్న రూ.163 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 401శాతం ఎక్కువ
* పరోక్షంగా లాభపడే సంస్థల్లో రాష్ట్రాల విద్యుత్ బోర్డులు ఉన్నాయి. టీవీకి గంటకు 45వాట్ల విద్యుత్ కావాలి. అర్థరాత్రి 12 దాటిన తర్వాత టీవీ చూసే వారు లేకపోతే ఒక్కో వ్యక్తికి 135 వాట్ల విద్యుత్ ఆదా. మొత్తం 3.24లక్షల కిలో వాట్ల కరెంట్‌ను బోర్డులు ఆదా చేసుకోగలుగుతాయి.
* అదే మొత్తం 8 గంటలు క్రికెట్ చూడకుండా టీవీని స్విచ్‌ఆఫ్ చేస్తే విద్యుత్ బోర్డులకి కనీసం 8.64లక్షల కిలోవాట్లు అదనంగా లభిస్తాయి. ఇప్పటికే ఇది ఆచరణలోకి వస్తోంది కూడా.
ఇంకా క్రికెట్ గురించి మాట్లాడి మన సమయం వృథా చేసుకోవటం అవసరమా?
పూర్తిగా చదవండి