తెలుగు(త)ధనం
Telugu March 31st, 2007
గురుజాడ అడుగుజాడలో నడవరా ఓ తెలుగువాడా!
కుల పిచ్చి, మత గజ్జి, ప్రాంతాల పేచి తెచ్చును జాతికి ఛీడ
యాసలు వేరైనా మన భాషలో తియ్యందనం ఒక్కటే
ప్రాంతాలు వేరైనా మనలోని తెలుగుతనం ఒక్కటే
విభజించు పాలించు - దేశాన్ని కొల్లగొట్టిన తెల్లవాడి వేర్పాటువాదం
ఐకమత్యం మహాబలం - దేశానికి కొల్లాయికట్టి స్వాతంత్ర్యం తెచ్చిన నల్లవాడి సమైక్యనాదం
ఐదువేళ్ళు కలిస్తేనే పిడికిలి
కోస్తా, దక్షిణకోస్తా, కళింగాంధ్ర, రాయలసీమ, తెలంగాణాంటు విడిపొతే మిగిలేది ఖాళి
శ్రీకాళేశ్వరం,ద్రాక్షారామం, శ్రీశైల త్రిలింగాల మధ్య విస్తరించి విలసిల్లిన పుడమి మన తెలుగుభూమి
వీటిని విడదీస్తే తెలుగు పదానికి అర్థం ఉండదు సుమి
కలసివుంటూ కష్టసుఖాలు పంచుకుంటూ ప్రగతిబాటలో నడుచుకుంటూ తెలుగుజాతి సత్తా లోకానికి చాటు
హుందాగా ఉండే తెలుగువాడి పంచెకట్టు
రాజసం ఉట్టిపడే ఆంధ్రుడి మీసకట్టు
దేశభాషలందు లెస్సైన తెలుగుభాష తలకట్టు నిలబెట్టు
ప్రపంచ చరిత్రలో నిలుపు తెలుగుదనానికి ప్రత్యేకమైన చోటు
పూర్తిగా చదవండి