కపాలమోక్షం
కవితలు, తెలుగు, సాహిత్యం April 2nd, 2007
నీడనివ్వని నిటారు చెట్టు
వనదేవత వడిలో ఒరిగితే
వెలసిన చల్లని పర్ణకుటీరం
పంచవటిలో ప్రేమమందిరం
సమ్మెటపోటుకి సడలని శిల
జలపాత గీతానికి కులికితే
నునుపుతేలిన గులకరాయొకటి
ప్రకృతి చెక్కిన సజీవశిల్పం
నిప్పులు చెరిగిన మార్తాండ తాపం
సంధ్యాసుందరి కౌగిట తురిగితే
విరిసిన పున్నమి వెన్నెల
ఆకాశామల నక్షత్రదీపం
మది తొలిచే ఆలోచనల కత్తివాదర
అంతర్మధనంలో కరిగితే
పుట్టిన ఒక కమ్మని కవితే
కవి జీవితానికో కపాలమోక్షం
(
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి