కావలసినవి :

కొబ్బరి - 1 cup (125gms)

శనగపప్పు - 1/2 cup

ఉల్లిపాయ - 1

పచ్చిమిరపకాయలు - 2

ఎండుమిరపకాయలు - 3

పసుపు - చిటికెడు

ఉప్పు - తగినంత

కరివేపాకు - 3

ఆవాలు - 1/4

నునె - 2 to 3 tbl spoons


తయారు చేసే విధానం :

1.ముందుగా శనగపప్పుని కడగాలి. అందులో 1 కప్పు నీళ్ళు పోసి వేసి కుకర్ లో 1 విసెల్ రానివ్వాలి. ఆ తర్వాత అందులో నీళ్ళని తీసెయ్యాలి.

2.ఇప్పుడు పాన్ లో నునె వేసి వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి.

3.అందులో ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు వుడికించిన శనగపప్పుని, ఉప్పు, పసుపు వేసి వేయించాలి.

4.ఇప్పుడు కొబ్బరి వేసి 3 నిమషాలు వేయించి మంట మీద నుంచి దింపెయ్యాలి.

5.శనగపప్పు-కొబ్బరి కూర వేడి వేడి అన్నంతో ఆరగించండి.

పూర్తిగా చదవండి