Saturday 14th April 2007 9:42 PM


అందమైన కన్నె కాటు నన్ను ముంచేసింది..
పలకరించబోతె తనని, కస్సుబుస్సులాడింది..

వెన్నెలంటి వన్నెలాడి వెన్ను చూపి వెళ్లిపోయింది..

నన్నెవరు కదిలించినా, కన్నీరే అన్నిటికి బదులయ్యింది..

నాడెపుడో కనుమరుగై నేడెందుకు కనిపించింది, నన్నెందుకు కాల్చేస్తుంది..

ఎన్నేళ్ళు నాకీ నరకం, పెను భూతమై నన్నె వెంటాడుతుంది..

ప్రేమిస్తుందో, నన్ను ఆట పట్టిస్తుందో, తేల్చేస్తే బాగుంటుంది..

కడిగేద్దామని తన దగ్గరికెళ్తే, ప్రేమిస్తున్నానంటూ విలపించింది..

బండ రాయి అనుకున్న నా గుండె, ఈ నారీమణికిప్పుడు రత్నంలా కనిపిస్తుంది..

ఎడారి ఇసుకలో అడుగేస్తుంటే, ఇప్పుడు తన ప్రేమ నాకొక ఎండమావిలా అనిపిస్తుంది..


can't read telugu? read the t-english version here


పూర్తిగా చదవండి