వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ

పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది

కన్నులకేలా నాపై కోపం కణకణలాడినవి

నీ చూపులకేనా నాపై కోపం తూపులు దూసినవి

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ

ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది

బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…

బులిపించు పైట కలహించి అకటా తరిమినదెందులకో…

నీ వలపులు చిందే పలుకుల విందే చేదుగ మారినదో

పీటలపైన పెళ్ళిదినాన మాటలు కరువైనా

నన్ను ఓరచూపుల కోరికలూరా చూడవా నీవైనా..

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ

ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది

మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా..

ఓ..ఓ..ఓ.. మరదలు పిల్లా జరిగినదెల్లా మరచుటే మేలుగదా..

నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా ..

నిను కోరిన బావను కూరిమి తోడను చేరుటే పాడిగదా ..

వెన్నెలకేలా నాపై కోపం సెగలై ఎగసినదీ

ఈ పూవునకేలా నాపై కోపం ముల్లై గుచ్చినది

చిత్రం : కానిస్టేబుల్ కూతురు

గాత్రం : పి.బి.శ్రీనివాస్

పదం : ఆచార్య ఆత్రేయ

స్వరం : ఆర్. గోవర్ధన్


పూర్తిగా చదవండి