నగుమోము చూపించవా గోపాలా
నగుమోము చూపించవా గోపాలా

మగువల మనసుల నుడికింతువేలా

నగుమోము చూపించవా గోపాలా …..

ఎదుటఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట

ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట ….
ఎదుట వెన్నెల పంట ఎదలో తీయని మంట

ఇక సైపలేను నీవే నా ముద్దుల జంట

నగుమోము చూపించవా గోపాలా…..

వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ

వగకాడవని నిన్నే వలచీ వచ్చెను రాధ

మగనాలిపై ఇంత బిగువు చూపెదవేల

నగుమోము చూపించవా గోపాలా ….

కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య

కలువ పువ్వుల శయ్య పిలిచేను రావయ్య
నెలవంకలిది నన్ను అలరించవేమయ్య

నగుమోము చూపించవా గోపాలా ….

చిత్రం : అమరశిల్పి జక్కన్న

గాత్రం : పి.సుశీల

పదం : Dr. సి. నారాయణరెడ్డి

స్వరం : (ర) సాలూరు రాజేశ్వరరావు


పూర్తిగా చదవండి