నాగరాజు గారూ… విజయోస్తు !
అభిప్రాయాలు, ఉత్తరం, సౌందర్య శాస్త్రం April 25th, 2007నాగరాజు పప్పు గార్కి !
మీరు ఇంజనీరుననీ, సాహితీ వేత్తను కాదంటూనే బ్లాగ్మిత్రులను ఉత్తమ సాహిత్యం, కళాస్వాదనల వైపుకి పయనింప చే్స్తున్నారు.ఇలాంటి మీ ప్రయత్నాన్ని ప్రతివారూ అభినందించ కుండా ఉండాలేరు. అందులో నేనూ ఒకడిని!
మీరు బ్లాగులో రాస్తున్నారు. కంప్యూటర్ పరిభాష, బ్లాగు స్పర్శతో అక్కడక్కడా కొంతమంది బ్లాగు మిత్రులను ఉటంకిస్తూ ” విషయాన్ని ” బోధన పధ్ధతిలో వివరించటం చాలా బాగుంది. అలంకార శాస్త్రంలో “సౌందర్య” చర్చ ఉన్నా, ఆధునిక కాలంలో సౌందర్య శాస్త్రం ఒక ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ది చెందటంలో పాశ్చాత్యుల కృషి ప్రశంస నీయం.పుట్టని బిడ్దకి పేరు పెట్టాడని క్రోచీ వ్యాఖ్యానించినా గానీ, Alexander Gottlieb Boumgarten నే సౌందర్య శాస్త్రానికి ఆద్యుడిగా విమర్శకులు భావిస్తున్నారు. తన గ్రంథానికి Aesthetics అని పేరు పెట్టినా, కళా సౌందర్యం గురించి ఆయన (Alexander Gottlief Boumgarten) Aesthetic (1750) గ్రంథం లో చేసిన వివేచన ఎక్కువ మంది మెప్పుని పొందలేదని చెప్పిన వారున్నారు. అయినా ఆయన కృషిని విస్మరించ లేని స్థితి. అలాగే భారతీయులలో ముఖ్యంగా భరతుడు నాట్యశాస్త్రంలో సౌందర్యానికి సంబంధించిన అనేక విషయాలు చెప్పాడు. అయినా, సౌందర్య శాస్త్రం గురించి చెప్పేటప్పుడు పాశ్చాత్యులతోనే మొదలు పెడతుంటాం.!
మీరు ఒక మంచి రచనకు పూను కున్నందుకు మిమ్మల్ని మరోసారి అభినందిస్తూ… మీ రచనకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.
(నాగరాజు పప్పు గారు సౌందర్య శాస్త్రంలో గల కొన్ని మౌలిక విషయాలను వివరిస్తూ రాయబోతున్న వ్యాస పరంపరకు ఆయన రాసిన ఉపోద్ఘాతం చదివి రాసిన నా అభిప్రాయం)

పూర్తిగా చదవండి