క్రిమీలేయర్ … చిన్న వివరణ
అభిప్రాయాలు, ఉత్తరం, చర్చ April 26th, 2007ప్రసాద్ గారూ!
మీ స్పందనకు ధన్యవాదాలు.
క్రిమీలేయర్ అంటే ఏమిటో మీకు తెలుసనుకుంటాను. ఒకసారి రిజర్వేషన్ అవకాశాలను పొందిన వాళ్ళ కంటే, అసలు ఆ అవకాశాలు అందని వాళ్ళకు రిజర్వేషన్ సౌకర్యాలు అందాలనే ఆలోచన క్రిమీలేయర్ లో ఉంటుంది. ఇప్పుడున్న రిజర్వేషన్ వ్యవస్థలో కొన్ని వర్ణాలవారే అవకాశాలను పొందుతున్నారు. ఉదాహరణకు బాగా చదువుకున్న వాళ్ళ. రాజకీయవేత్తల పిల్లలతో గ్రామీణ ప్రాంత విద్యార్తులు పోటీ పడలేరు. అందులోనూ మొదటి తరం వాళ్ళు ఇప్పుడిప్పుడే విద్యావకాశాలను అందుకోవాలను కుంటున్నారు. వాళ్ళూ చాలావెనుకబడి ఉంటారు. కనుక, ఒకతరం రిజర్వేషన్లు పొందిన వాళ్ళు, తరువాత మళ్ళీ రిజర్వేషన్లు పొందడం కంటే, అసలు పొందని వాళ్ళకు ఆ అవకాశాన్ని కలిగిస్తే బాగుంటుంది. అప్పుడు మన రాజ్యాంగం ఆశించిన లక్ష్యం నెరవేరుతుంది. కలకాలం కొన్ని వర్ణాల వారే రిజర్వేషన్లు పొందాలనుకోవటం సమర్థనీయం కూడా కాదు. రాజకీయ వేత్తల్లా మేథావులు కూడా మాట్లాడితే సమస్యలు పరిష్కారాలు అందవు. ప్రస్తుతం వర్ణానికి ( కులానికి) ప్రాధాన్యతనిచ్చేరిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. దీని వల్ల బయిటికి కనిపించక పోయినా కొని వర్ణాల పట్ల మరికొన్ని వర్ణాల వారికి ద్వేష భావం పెరిగి పోతున్నది. ఒక నిస్సహాయతనుండి పుట్టు కొస్తున్న ద్వేష భావమది . దీనికి కారణం కేవలం రి్జర్వేషన్లకు కులాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోవటం ఒక ప్రధాన కారణం. అందు వల్ల అవసరమైన మేరకు ఆర్థిక కారణాలను కూడా పరిగణ లోకి తీసుకొని కొంతకాలం రిజర్వేషన్లు అమలు చేయాలనేది ఒక వర్గం వాదన.ఇదే సుప్రీం కోర్టు వాదనలో సారాంశం. అంతే తప్ప క్రిమీలేయర్ లోనూ రిజర్వేషన్లు ఎలాఉంటాయండీ

పూర్తిగా చదవండి