ప్రజల మనిషి - 6
కథలు, నవల April 30th, 2007 - వట్టికోట ఆళ్వార్‌స్వామి
(గత సంచిక తరువాయి)
‘పాపం మీనాయనగారు పెద్దమనిషి. ఆయన గతించినప్పటి నుండి అన్నీ చిక్కులేనని విన్నాను’’ రామభూపాల్‌రావు మాట్లాడటానికి పిలిపించిన వెంకటాచారితో పరామర్శగా అన్నాడు.
రామభూపాల్‌రావు ఆవిధంగా శాంతంగా, చనువుగా మాట్లాడటం వెంకటాచారికి ఆశ్చర్యం వేసింది. రామభూపాల్‌రావు ఎల్లప్పుడు అధికార ధ్వనిలో మాట్లాడటం అతనికి తెలిసన సంగతి. రామభూపాల్‌రావు అంటే వెంకటాచారికి భయం కూడాను.
“మీకు తెలియందేముంది?’’ వెంకటాచారి నీళ్ళు మింగుతూ అన్నాడు.
“మీ నాయనగారు పాపం చదువుకున్నవాడే. పూజనీయుడే. కాని చదవుకున్నాననే గర్వం మాత్రం బాగావుండేది. [...]
పూర్తిగా చదవండి