వేకువ కోసం
కవితలు April 30th, 2007
- నబి కె. ఖాన్
1
ఆవేశం నిండిన
నా ఆలోచనలోకో
ఆలోచన నిండిన
నా అంతరంగంలోకో
ఒకానొక
ఉల్క రాలుతున్నప్పుడు
నేను చూసిన అనుభవం నుంచి
ఒకానొక
వాల్కనో పేలుతున్నప్పుడు
నేను విన్న అలజడి నుంచి
సమాధానం దొరకని సందిగ్ధం నుంచి
నర్మగర్భమైన నిశ్శబ్దాన్ని
మోసుకొస్తున్నాను
బహుశ…
ఇది నాందీ ప్రస్థానం
రెట్ట వేయడానికి
తెలియని ఓ పిట్ట
మసీదు గుమ్మటం మీద ఎగిరి
ఏ గుడో గోపురానో వాలుతుంది
హరాం హలాల్‌ల గురించి
తెలియకనేమో
హేరాం యా అల్లాహ్‌ల మధ్య
రెక్కలు తెగి రాలిపోయింది
ది హందర్ద్‌పై హత్యా ప్రయత్నం
ఓ మిత్రమా!
ఈ భగ్న సమాజపు
దగ్ధ సంగీతాన్ని మోసుకొచ్చే
ఆ పిట్టకు మనమొకసారి
మనసారా క్షమాపణ చెప్పుకొందాం!
ఆకలి పేగులు అరచే వేళ
అల్లాహ్ అచ్ఛాహో యా [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి