నా యాస రగిలింప సాయముగ యెంకి పూల దన చెక్కిళ్ళు మేలుకొలిపేను... బాధ నా యెదనింప సాధనగ యెంకి పెదవి జిగజిగ పూల పదును పరిచేను... విసిగించి నన్నొంఫ వీలుగా యెంకీ పూలలో రాచకా ర్యాలు సలిపెను... కోపాల నా కోట కూలువగ యెంకి పూల రంగములోన కాలు దువ్వేను... రచన : నండూరి సుబ్బారావు ప్రచురణ : నవరత్న బుక్ హౌస్
పూర్తిగా చదవండి