అమావాస్య, అర్ధరాత్రి ... చుట్టూ చిమ్మచీకటి.ఆ పల్లెటూళ్లో ఆదమరచి నిద్రిస్తున్న చంద్రుడికి ఆకస్మాత్తుగా మెలకువ వచ్చింది. చెట్టు కింద నుంచి ఒళ్లు విరుచుకుంటూ లేచాడు. దూరాన తన వేపు వస్తూన్న కాంతి పుంజాలు. అంతలోనే పొలంవేపు నుంచి చెవిటి లచ్చింగాడు "కొరివి దయ్యాలు వస్తున్నాయి లగ్గెత్తండి బాబయ్యా!" అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.చంద్రుడు కూడా భయపడి పరుగు లంకించుకున్నాడు, కానీ కాసేపట్లోనే గుర్రపు డెక్కల శబ్ధం...దివిటీలతో కదం తొక్కుతూ వెళ్తూన్న 'రాయల'వారి సైన్యం!
{55 పదాలతో కథ...'కొత్తపాళీ' గారి సూచన - నా మొదటి ప్రయత్నం.}

పూర్తిగా చదవండి