సుందరాంగా అందుకోరా …
పాత పాటలు May 2nd, 2007
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమాడగ సంతోషమురేగ చెంత చేరరాద
కేలు కేలగొని మేనులేకముగ ఏకాంత సీమలలో
మది సంతాపమాడగ సంతోషమురేగ చెంత చేరరాద
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు తాపాన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
యోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం
చాలు తాపాన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
అట రంగారు బంగారు మీనాలమై కవులూరింతు క్రొందేనె జూఱ్ఱాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై కవులూరింతు క్రొందేనె జూఱ్ఱాడుదాం
ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తనిదీర ఈదాడుదాం
ముదమార తనిదీర ఈదాడుదాం
సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా
ఆనందలోకాలు చూపింతురా
సుందరాంగా అందుకోరా … సుందరాంగా అందుకోరా ..
సుందరాంగా అందుకోరా … సుందరాంగా అందుకోరా..
సుందరాంగా అందుకోరా .. సుందరాంగా అందుకోరా
సుందరాంగా … సుందరాంగా … సుందరాంగా …
ఓం నమశ్శివాయ … ఓం నమశ్శివాయ .. ఓం నమశ్శివాయ
చిత్రం : భూకైలాస్
గాత్రం : “గాన కోకిల” పి. సుశీల
పదం : సముద్రాల సీనియర్
స్వరం : ఆర్. సుదర్శనం & గోవర్ధన్
పూర్తిగా చదవండి