సర్రియల్ సినిమా / Luis Buñuel / Surreal cinema
డైరెక్టర్లు, షార్ట్ ఫిలంస్, సర్రియల్ సినిమా, సినిమాలు May 8th, 2007
చాలా రోజుల తరువాత తీరిక దొరకడం తో డౌన్ లోడ్ చేసి చూడకుండా వదిలేసిన సినిమాల లో కొన్ని
వరుసపెట్టి నాలుగైదు చూసేసా అందులో Los olvidados ఒకటి
దీన్ని Luis Buñuel డైరెక్ట్ చేసారు , ఆయన ఇంకో సినిమా Un chien andalou / An Andalusian Dog
గురించి ఇంతకు ముందు ఇక్కడ ఓ చిన్న పోస్టు రాసాను , కాక పోతే అది షార్ట్ సినిమా ఇది ఫుల్ల్ లెంత్ సినిమా ...
Los olvidados .. కచ్చితంగా one of the best flicks I did ever watch , మెక్సికో లో వీధి బాలల నేపధ్యం లో సాగుతుంది కధ ...
Italian neorealism స్పూర్తి తో తీసారు ఈ సినిమా , ఇందులో మరీ andalou లో ఉన్నంత సర్రియలిసం లేక
పోయినా అక్కడక్కడా ఆ చాయలు కనిపిస్తాయి.
అసలు సర్రియల్ సినిమా కి Luis Buñuel గాడ్ ఫాధర్ లాంటి వారని పేరు , నేను ఇప్పటి వరకూ చూసిన ఆయన
సినిమాలు andalou , Los olvidados మాత్రమే . ఆయన తర్వాత ఈ genre అంత ఖ్యాతి సంపాదించిన
వారు ఎవరూ లేరంకుంటా , ఇప్పటికీ కేవలం సర్రియల్ genre కే కట్టుబడి సినిమాలు తీసే వారు అక్కడక్కడా
కనిపిస్తారు , అందులో నాకు తెలిసీ ముఖ్యమైన వారు David Lynch ఈయన సినిమాల్లో సర్రియల్ చాయలు
విపరీతంగా కనిపిస్తాయి ముఖ్యంగా Blue Velvet , Mulholland Dr ... ఈయనవన్నీ ఫుల్ల్ లెంత్ సినిమాలే ...
కాక పోతే సర్రియల్ genre లో చాలా వరకూ కనిపించేవి ఇండిపెండెంట్ షార్ట్ films ఏ .. ఈ కోవ కు చెందిన వారి లో
Guy Maddin ఒకరు .. ఈయన సినిమా The saddest music in the world మాత్రమే చూసా ..బావుంది ...
ఇక bruce willis, bradpitt తో Twelve Monkeys , robert de niro తో Brazil సినిమాలు తీసి sci-fi , ఫాంటసీ
సినిమాల డైరెక్టర్ Terry gillam కూడా ఈ కోవకు చెందిన వాడే.
ఆ రెండు సినిమాల్లో కూసింత సర్రియల్ చాయలు కనపడతాయి.

David Lynch సినిమా Blue Velvet పోస్టర్
పూర్తిగా చదవండి