Can't see Telugu? Learn here. More Questions? Ask here.

భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!! ౨

Telugu May 10th, 2007
భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!! అంటున్నాడు రాము,
అవును బతికించుకోవడమేమిటి??
ఎవరు ప్రయత్నిస్తున్నారు బతికించుకోవడానికి??

౨౦౦౨ లో అందరి లానే అమీర్‌పేట్ లో మల్టీమీడియా కోర్స్ నేర్చుకున్నా. ప్రతీ రోజూ గాంధీ నగర్ నుంచి అమీర్‌పేట్ కి వచ్చి వెళ్ళేవాడిని. ఒక రోజు అలా బస్సులో తిరిగి వెళ్ళేప్పుడు నా పక్కన ఒకతను కూర్చున్నాడు(క్షమించాలి, అతని పేరు గుర్తులేదు). అతని చేతిలో డ్రాయింగ్ పుస్తకమొకటి ఉంది. మీరు ఆర్టిస్టా అని అడిగాను, కాదు అంటూ ఆ పుస్తకాన్ని చూపించాడు. అందులో ’అ, ఆ’ ల నుంచి తెలుగులోని వదిలిపెట్టేసిన అచ్చులు వరకు ఉన్నాయి. తెలుగు భాషలో ఏవి వదిలేసారో, ఎందుకు వదిలేసారో అన్నీ వివరంగా చెప్పారు. అలా నేను ఎన్నో విషయాలు అతని ద్వారా తెలుసుకున్నాను. నిజంగా తెలుగు భాష తియ్యనైనదే, అందులో సందేహం లేదు. కాకపోతే ఒక ’ముస్లిం’ ఇన్ని విషయాలు ఎలా చెప్పగలరు? అవును అతనొక ముస్లిం. పేరు ఖాదర్ అన్నట్టు గుర్తు. తెలుగు నేర్చుకోవడానికి వచ్చే విదేశీయులకి కేవలం ౫(ఐదు) రోజుల్లో నేర్పుతారంట. ఇటువంటి వారు ఉన్నంతవరకు తెలుగు భాషని బతికించుకోవడాలు, రక్షించుకోవడాలు అవసరం లేదు.



Photobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image HostingPhotobucket - Video and Image Hosting ఐతే OK..

పూర్తిగా చదవండి

భాషను బతికించుకోవడమేమిటి? నీ బొంద!!

సాహిత్యం May 10th, 2007
అమ్మాయిని చూడ్డానికొచ్చినవాడు రిషభాన్ని వృషభం అనగానే శంకరశాస్త్రికి ఒళ్లూపైతెలీకుండా పోతుంది - శంకరాభరణం సినిమాలో. "మన తెలుగుభాషను రక్షించుకుందాం, బ్రతికించుకుందాం, కాపాడుకుందాం ..." ఇలాంటి మాటలు ఎవరినోటైనా వింటే నాకూ అంతే. "బ్రతికించుకోవడమేమిటి నీబొంద? అదొక ఘనకార్యమన్నట్లుగా చెబుతున్నావు! నువ్వు బ్రతికించకుంటే భాషకేమిటి నష్టం? అది చచ్చి ఊరుకుంటే ఎవరిదేం పోయింది? అవసరం లేనపుడు 'రక్షించుకోవడమ'నే
పూర్తిగా చదవండి