ఇరవైఐదుసంవత్సరాల తెలుగుదేశం ఉత్థానపతనాలు
Articles, Reviews, Telugu, Veekshanam May 11th, 2007అప్పటికి ముప్పై సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో తిరుగులేని అభిమాన నాయకుడిగా, దైవపాత్రలు పోషించి దైవసమానుడిగా లక్షలాది అభిమానులను సంపాదించుకున్న నందమూరి తారకరామారావు 1982 మార్చ్ 29 న తెలుగుదేశం అనే ప్రాంతీయ రాజకీయపక్షాన్ని ప్రారంభిస్తున్నానని ప్రకటించినప్పుడు అది ఎక్కువకాలం మనబోయే ప్రతిపాదన కాదని చాలమంది విశ్లేషకులు భావించారు. ఒక సినిమాతార పట్ల ప్రజలలో ఉండే వేలంవెర్రి అభిమానం వేరని, అది రాజకీయ నాయకత్వానికి పనికి రాదని చాలమంది భావించారు. కాని ఆ రాజకీయపక్షం తొమ్మిదినెలల కాలంలోనే, 1983 జనవరి 8న ప్రభుత్వాన్ని స్థాపించగలిగింది. మరొక ఏడాదిన్నర తర్వాత భారీ వెన్నుపోటుకు గురయికూడ ఇతర ప్రతిపక్షాల మద్దతుతో, ప్రజాఉద్యమంతో తన అధికారాన్ని పునరుద్ధరించుకోగలిగింది. ఆ అధికారాన్ని మరొక ఐదు సంవత్సరాల తర్వాత కోల్పోయినప్పటికీ, ఆ మరుసటి ఎన్నికలలో తిరిగి అధికారాన్ని సంపాదించడం మాత్రమే గాక అంతర్గత ఘర్షణలను కూడ తట్టుకుని మరొక రెండు దఫాలు రాజ్యంచేసింది. రెండున్నర దశాబ్దాలు రాష్ట్రాన్ని అప్రతిహతంగా పాలించిన కాంగ్రెస్ పార్టీని శాసనసభలో పదోవంతుస్థానాల స్థితికి నెట్టివేసింది. రాష్ట్రంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలలో పెనుమార్పులను తీసుకువచ్చింది. రాష్ట్రంలోనే గాక దేశరాజధానిలో కూడ చక్రంతిప్పే స్థాయికి ఎదిగి జాతీయ ఐక్యసంఘటనలలో, కూటములలో ప్రధాన పాత్ర వహించింది.
(more…)
పూర్తిగా చదవండి