చెన్నై కబుర్లు
general May 12th, 2007నేను చెన్నై నిరుడు నవంబర్ లో వచ్చాను. చెన్నై నాకు కొత్తేమీ కాదు. చదివింది ఇక్కడే. కానీ మళ్ళీ ఇక్కడికి వస్తానని అనుకోలేదు.
చదువుకొనే రోజుల్లో సినిమాలు బాగాచూసేవాడిని. తమిళ్ సినిమాలలో నాకు ఎక్కువ ఓవర్ యాక్షన్ కనపడుతుంది. ఇప్పుడు అలవాటైంది.
ఇక్కడ ముఖ్యంగా జనాలకి భక్తి ఎక్కువ. అని నాకే అనిపిస్తుందేమో. గుడి కనపడితే చాలు చంపలు కొట్టుకుంటారు, గుంజిళ్ళు తీస్తారు. మొహమంతా పసుపు పూసుకొని, పసుపుపచ్చ చీరకట్టుకొని, మంత్రాలు చదులుకొంటూ గుడిచుట్టూ తిరిగే ఆడవారిని చూస్తే భలే ముచ్చటేస్తుంది. మగవారైతే అడ్డబొట్టూ,లుంగీ.. ఇలా ఒకటైపు.
ఇక్కడి వారికి కొంచం neatness తక్కువే. వాళ్ళని చూస్తే నేను చాల నీట్ గా వుంటానేమోననిపిస్తుంది. ఇక్కడి వాతవరణం మూలంగా మీరెన్నిసార్లు స్నానం చెసినా మీరు జిడ్డు కారుతూనే వుంటారు. తమిళ్ అంటే మనకు మొదట గుర్తుకొచ్చేది సాంబారు. వీళ్ళు ప్రతిదాంట్లోను సాంబార్ తింటారు. సంబార్లేని భొజనం కానీ, tiffin కానీ కనపడదు. ఇడ్లీ, వడ, దోశ, చపాతి, పూరీ, కావేవీ సాంబరుకనర్హం.
మీరు ఏదైన హోటల్ కి వెళితే జాగ్రత్తగా వుండాలి. మీరు ఇడ్లి అనగానే వాడు ఇడ్లీతోపాటు సట్ని (ఇక్కడలా అంటారులేండి), సాంబార్ తెస్తాడు. ఇడ్లీలో చెట్ని, సాంబారు కలిపి పోస్తాడు. వాటిని వీళ్లు ముద్దలా కలిపి తింటారు. మనకు కష్టమే. కానీ వచ్చినప్పుడు తప్పదుకద? అవాన్నీ చూడకుండా తినాలి. అదీ సాంబారు గొడవ.
ఇంక భోజనాల విషయానికొస్తే. వీళ్ళ వంటలు మనకు నప్పవు. కారం, వుప్పు, కూరగాయలు అన్నీ మనం వాడేవే వాడతారు. కానీ రుచీ పచి వుండవు. అప్పుడొకసారి ఈబాధ పడలేక మనమే వంట చేసుకొందామని మొదలు పెట్టాను. కారం, వుప్పు మీద మమకారంతో కొంచం ఎక్కువవాడను. అది తిన్నాక వీళ్ళ వంటలతోనే బెటర్ అనిపించింది.
వీళ్ళకి వీరి భాషంటే చాల ఇష్టం. వీరి నర నరాల్లో తమిళ్ పారుతూ వుంటుంది. తమిళ్ ని మించిన అందమైన, శ్రావ్య మైన భాష మరెక్కడ లేదని వీరివాదన. కాదని పొరపాటున కూడ వీళ్ళతో అనకండి. నేను చెప్పను. మీకు అర్ధమై వుంటుంది. వీరికి ప్రతి ఆంగ్ల పదానికి ఒక తమిళ్ పదం వుంది. ఉదాహరణకు bus ను మనం bus అనే అంటాం. దానికిక్కడ ఒక పదం ఉంది. అదేంటో అడక్కండి, నాకూ తెలీదు. ఇంకా చిన్న bus కి పదం, పెద్ద bus కి ఒక పదం వాడతారు. lift కి, computer కి, bank కి ఇలా నాకూ తెలీదు, కానీ చాలవరకు వెళ్ళకి ప్రత్యేక పదాలున్నయి. అంత భాషామమకారం మనకి లేదు.
ఇంతటితో చెన్నై కబుర్లు సమాప్తం.
వుంటాను. మళ్ళీ కలుద్దాం.
– మురళి కృష్ణ
పూర్తిగా చదవండి