వుత్త మాటలు
యెంకి పాటలు May 12th, 2007
"వుత్త మాటలు నీవి పొ"మ్మందిరా
యెంకి
"కొత్త్ పాటలు పాడుకొ"మ్మందిరా
వూరెల్త నని పలికి
మా రేస వేసుకొని
"సకినాల పా లొచ్చు
సకిన మడు" గన్నాను
"వుత్త మాటలు నీవి పొ"మ్మందిరా
యెంకి
"కొత్త పాటలు పాడుకొ"మ్మందిరా
"యీ రోజు నీ రాజు
వూరెల్లినా"డంటి
"యేరాపులో రూపు
మారిపోయిం"దంటి
"వుత్త మాటలు నీవి పొ"మ్మందిరా
యెంకి
"కొత్త్ పాటలు పాడుకొ"మ్మందిరా
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి