గగనాన పూసిన తారల కుసుమాలు కోసి జడలో తురుముతానంటే అమ్మ నవ్వింది మురిపెంగా అంబరాన మెరిసే హరివిల్లు తెచ్చి ఊయల కట్టి ఊపుతానంటే ఉప్పొంగి ముద్దులాడింది ముచ్చటగా మబ్బుల్లో జాబిలి కోసం మారాం చేస్తే అద్దమిచ్చి బుజ్జగించి బొజ్జ నింపింది ఆప్యాయంగా వానజల్లు కురిసి వళ్ళంతా తడిసి వణుకుతుంటే తుమ్ములొస్తాయిరా కన్నా అంటూ తల్లడిల్లింది బాధగా ఉరిమే మేఘాలను చూసి ఉలిక్కిపడితే ఊరడించి వెన్నుతట్టింది మమతగా గజగజలాడే పొగమంచు కమ్మేసినపుడు వెచ్చటి తన ఒడిలో చోటిచ్చింది ప్రేమగా నిప్పులు కక్కే గ్రీష్మంలో తన కొంగు గొడుగుగా పట్టి ఆ నీడలో సేద తీర్చింది చల్లగా అనుక్షణం అనుసరించి అన్నింటా తొలిగురువై మాతృత్వాన్ని పంచింది మధురంగా తన ఆలంబనతో ఉన్నత శిఖరాలు అధిరోహించినపుడు [...]
పూర్తిగా చదవండి