పావ్ బజ్జి
అల్పాహారం, టిఫిన్స్ May 20th, 2007
కావలసినవి :పావ్ లు - 8
బట్టర్ - పావ్ లు వేయించడానికి
బజ్జి తయారికి :
బంగాలదుంపలు - 3(వుడకబెట్టి మెత్తగ చెయ్యాలి)
ఉల్లిపాయలు - 2
టొమటొలు - 2
బీన్స్ - 1/4 cup
క్యారెట్ - 1/4 cup
పచ్చి బఠానిలు - 1/4 cup
క్యాప్సికం - 1
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 to 2 tbl spoons
బట్టర్ - 2
పావ్ బజ్జి మసాల - 2 to 3 tbl spoons
కారం - 1 to 1 1/2 tbl spoons
ఉప్పు - తగినంత
నిమ్మ జూసు - 1/2 tbl spoon
నీళ్ళు
కూర దింపేముందు :
కొత్తిమెర
ఉల్లిపాయలు - 1(ముక్కలు)
తయారు చేసే విధానం :
కూర తయారికి :

1.ముందుగ బీన్స్, క్యారట్, పచ్చిబఠానిలు వుడకబెట్టి దానిని కొంచెం చిదిమి పెట్టుకోవాలి.
2.పాన్ లో బట్టర్ వేసి వేడి చెయ్యాలి.
3.ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయముక్కలు, టొమటొ ముక్కలు వేసి వేయించాలి.
4.అందులో బంగాలదుంపను, పావ్ బజ్జి మసాల, కారం, ఉప్పు వేసి 2 నుంచి 3 నిమషాలు వేయించాలి.
5.ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి కాసేపు వుడకనివ్వాలి.
6.ఇప్పుడు మంట మీద నుంచి దింపి అందులొ ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమెర, నిమ్మ జూసు వేసి కలపాలి.
1.ఇప్పుడు పావ్ ని రెండు సగాలుగ చేసి దాని మీద బట్టర్ వేసి, పాన్ వేడి చేసి పావ్ రెండు వైపులా వేయించాలి.
2.వేడి వేడి పావ్ బజ్జి ఆరగించండి.
పూర్తిగా చదవండి
