రాయాలని ఉంది ఎంతో చెప్పాలని ఉంది ఆలోచనలు పంచుకోవాలని ఉంది అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది మార్గం అన్వేషించాలని ఉంది మార్పును ఆహ్వానించాలని ఉంది ఆత్మావలోకనం చేసుకోవాలనుంది అభ్యంతరాలను తెలపాలని ఉంది మాట నేర్చిన మనిషి మనసుకిన్ని మెలికలెందుకో రాయ నేర్చిన వారికి చదివి ఎరుగుట కష్టమెందుకో నచ్చిన మాట నెత్తికెత్తుకుని నచ్చనివన్నీ తప్పులందురు మాట మాటకు బదులు చెప్పినా ముందు మాటను విడువకుందురు పేరు చెప్పక పరువు తీస్తే స్వేచ్ఛ అని సమర్థింతురు పేరు చెప్పి ప్రశ్నిస్తే అవమానమని ఆక్షేపింతురు ఏమి చెప్ప వలె ఇక ఏమి రాయ వలె చెప్పినది ఒకటైతే చెప్పుకునేది ఇంకొకటి ఆశలన్నీ ఇంతేనా ఆశయాలిక అడుగంటెనా?  
పూర్తిగా చదవండి