ఆనాటి నావోడు సెందురూడా! అలిగి రాలేదోయి సెందురూడా! "యెంకి మనమిద్దరమే యెవ్వరొ"ద్దన్నాడు; "యీ సేలు యీ తోట లింక నీ"వన్నాడు-- మాటాడుతుండంగ సెందురూడా! మచిదా పోయేవు సెందురూదా! "కలకాల మీదినమె నిలుసు మన" కన్నాడు "గాలికైనా తాను కవుగిలీ"నన్నాడు-- నను చూసి నవ్వేవు సెందురూడా! నాయనా నా ముద్దు సెందురూడా! నా కాసి సూశాడు నీ కాసి సూశాడు "మద్దె సెంద్రుడె మనకు పెద్దమని"సన్నాడు-- కన్నీరు నీకేల సెందూరూడా!
పూర్తిగా చదవండి