ఎప్పుడు  మగువ పరిచయము ఎప్పుడో మదిలోని బాధ తీరేది ఎప్పుడో తరుణి ఒడిలో సేదతీరి తనివితీరా మాటలాడేది ఎప్పుడో మనసులిచ్చి పుచ్చుకునేది ఎప్పుడో రెండు మనసులు ఏకమయ్యేది ఎప్పుడో ఏడు అడుగులు కలసి నడచి ఇరువురమొకటై కలసి బ్రతికేది ఎప్పుడో ఇంతి ఇల్లాలుగా రానున్నది ఎప్పుడో ఇంటిలో గృహలక్ష్మిగా తిరుగాడేది ఎప్పుడో అతివ నా అర్ధాంగిగా చెంతనుండగా దాంపత్య జీవితము గడిపేది ఎప్పుడో పడతితొ ప్రణయ గీతాలు ఎప్పుడో పండువెన్నెలలో మధురానుభూతి ఎప్పుడో వలచిన వనిత నా ఒడిలోనుండగా స్వర్గమే ఇలకు చేరేది ఎప్పుడో   *****************    
పూర్తిగా చదవండి